సావిత్రీబాయి ఫూలే: భారత మహిళా విద్యా ఉద్యమంలో మేధావి సావిత్రీబాయి ఫూలే (1831–1897) భారతదేశానికి చెందిన ప్రథమ మహిళా విద్యావేత్త, సామాజిక సంస్కర్త. ఆమె సమాజంలో మహిళలు మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం ప్రాణపణం పెట్టి పనిచేసారు. ప్రారంభ జీవితం సావిత్రీబాయి 1831 జనవరి 3న మహారాష్ట్రలోని నాయిగావ్ గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే (తొమ్మిదేళ్ళ వయసులో) జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగింది. జ్యోతిరావు ప్రోత్సాహంతో సావిత్రీబాయి చదువుకు ప్రాధాన్యత ఇచ్చారు, చదువు నేర్చుకొని సమాజాన్ని మార్గదర్శనం చేశారు. విద్యా విప్లవం 1848లో, సావిత్రీబాయి మరియు జ్యోతిరావు పూణేలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు చెప్పడం ఒక పెద్ద సమస్యగా ఉండేది. సావిత్రీబాయి అనేక వివక్షలను ఎదుర్కొంటూ విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశారు. తరువాత వారు అనేక పాఠశాలలను ప్రారంభించారు, ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం. సామాజిక సంస్కరణలు సావిత్రీబాయి కుల వివక్షను నిర్మూలించేందుకు గట్టిగా పోరాడారు. ఆమె "మహిళ సేవా మండల్" అనే సంస్థను స్థాపించి మహిళల అభ్యున్నతికి పునాదులు వేశారు. బాల్యవివాహం...
నూతన సంవత్సరం: నూతన సంవత్సరం అనగానే ముందుగా పాత సంవత్సరం చాలా ఇబ్బందిగా ఉంది కనీసం ఈ సంవత్సరం అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించాలి అనుకొంటారు. కానీ ఈ సంవత్సరం కూడా మీరు కట్టే EMI ఆగదు - మీకు ఉన్న అప్పు తీరదు, మీరు చేసే పని మారదు - నీవు జీవించే విధానం మారదు. మరి ఎలా ఈ సంవత్సరం కలిసి వస్తుంది? మీరు ఆలోచించే విధానం మార్చుకోవాలి - జ్ఞానమును పెంచుకోవాలి, చరిత్రను తెలుసుకోవాలి - బానిసత్వం నుండి బయట పడాలి, అధైర్యం వీడాలి - పట్టుదలతో జీవించాలి. అప్పుడే నీలో మార్పు వస్తుంది. ఈ సంవత్సరం కాదు యే సంవత్సరం అయినా సంతోషంగా ఇబ్బంది లేకుండా జీవిస్తావు. ఇకపై నీ మార్పును కోరుకుంటు నూతన సంవత్సర శుభాకాంక్షలు. Nagesh Maharaj P.