Skip to main content

Posts

Showing posts from December, 2024

Happy New Year

 నూతన సంవత్సరం: నూతన సంవత్సరం అనగానే ముందుగా పాత సంవత్సరం చాలా ఇబ్బందిగా ఉంది కనీసం ఈ సంవత్సరం అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించాలి అనుకొంటారు. కానీ ఈ సంవత్సరం కూడా మీరు కట్టే EMI ఆగదు - మీకు ఉన్న అప్పు తీరదు, మీరు చేసే పని మారదు - నీవు జీవించే విధానం మారదు. మరి ఎలా ఈ సంవత్సరం కలిసి వస్తుంది? మీరు ఆలోచించే విధానం మార్చుకోవాలి - జ్ఞానమును పెంచుకోవాలి, చరిత్రను తెలుసుకోవాలి - బానిసత్వం నుండి బయట పడాలి, అధైర్యం వీడాలి - పట్టుదలతో జీవించాలి. అప్పుడే నీలో మార్పు వస్తుంది. ఈ సంవత్సరం కాదు యే సంవత్సరం అయినా సంతోషంగా ఇబ్బంది లేకుండా జీవిస్తావు. ఇకపై నీ మార్పును కోరుకుంటు నూతన సంవత్సర శుభాకాంక్షలు.  Nagesh Maharaj P.