Skip to main content

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణాన్ని హెతుబద్దంగా సవరించాలి అని తెలియజేస్తూ మండల MRO కార్యాలయంలో వినతి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణాన్ని హెతుబద్దంగా సవరించాలి అని తెలియజేస్తూ 

ధర్మ సమాజ్ పార్టీ - సంస్థాన్ నారాయణపురం మండల  కమిటీ ఆధ్వర్యంలో మండల MRO కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా మండల కన్వీనర్ కొప్పు సంజీవ్ గారు మాట్లాడుతూ డిసెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ ఉచిత ప్రయాణంలో చాలా అనర్ధాలు, నష్టాలు ఉన్నాయని అందుకని హేతుబద్ధంగా ఈ ఉచిత ప్రయాణాన్ని సవరించాలని తెలియ జేస్తూ...

🔷 1.ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద మహిళలకు మాత్రమే అవకాశం కల్పించాలని తెలియజేశారు. దీనివల్ల ధనవంతులైన మహిళల ఉచిత ప్రయాణాన్ని నియంత్రించవచ్చని తెలిపారు.

🔷 2. నెలకు రూ.లక్ష సంపాదించే మహిళా ఉద్యోగస్తుల ఉచిత ప్రయాణాన్ని నియంత్రించవచ్చని సూచించారు. అదే ఆర్టీసీ బస్సులలో తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలైన ఇంటిని పోషించే పురుషులకు కూడా ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. 

🔷 3.ఆర్టీసీ బస్సులలో ఈ ఉచిత ప్రయాణం ప్రభావం ఆటో కార్మికులపై పడుతుందని, తద్వారా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నష్టాన్ని భరించడానికి ఆటోనడిపే కార్మికులందరికీ నెలకు రూ.3000 చొప్పున ఆర్ధిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణాన్ని ఈ విధంగా సంస్కరించి, సవరించి అన్ని వర్గాలకు మేలు చేకూర్చే పథకంగా సరిచెయ్యాలని ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు.


Comments

Popular posts from this blog

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించాలి...!!

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో  రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించాలి...!! భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించాలని ధర్మ సమాజ్ పార్టీ యాదాద్రి భునగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల అధ్యక్షులు కొప్పు సంజీవ్ డిమాండ్ చేశారు. ధర్మసమాజ్ పార్టీ తరఫున ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు తాము ప్రభుత్వానికి నివేదించిన ప్రతిపాదన నమునా చిత్రాన్ని ఆమోదించాలని శుక్రవారం నారాయణపురం మండల తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు. *ధర్మసమాజ్ పార్టీ నమూనా ప్రతిపాదన చిత్రంలో రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్, ఉస్మానియా యూనివర్సిటీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, పండగ సాయన్న, మరియు సమ్మక్క సారలక్క చిత్రాలు ఉన్నాయని తెలిపారు. అణగారిన వర్గాల పోరాట యోధుల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ మహనీయులను చిహ్నంలో పొందుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొప్పు సంజీవ్, మండల నాయకులు జలంధర్, సాయికుమార్, సందీప్, నగేష్ ,నవీన్, మధు తదితరులు పాల్గొన్నారు.

nagesh maharaj p

dsp nagesh maharaj p